30, డిసెంబర్ 2011, శుక్రవారం

పాలపీక

పాల పీక...పాలపీక
పాలివ్వని....పాలపీక

సీసానిండుగ వుంటే
పాలు గుమ్మరిస్తుంది.
ఆ సీసా లెకుంటే
తెల్లమొహం వేస్తుంది.

కన్నతల్లిని మరపిస్తుంది.
చిన్నపిల్లలను లాలిస్తుంది.
ఆదమరచి నిదురింపగ బిడ్డకు
అమ్మలాగ తోడౌతుంది.

నోటనుంటె పాలపీక
పిల్ల మోమున చిరునవ్వు
నిదరొతున్నారని తేసావో
ఉయ్యాలలో.. కెవ్వు..కెవ్వు..

ఏమైనా పాలపీక
శిశువుల నేస్తం
ఎంత ఏడుపైనా సరే
ఆపే ....అస్త్రం.

29, డిసెంబర్ 2011, గురువారం

చుక్కల లేడి.

చుక్కల లేడి చక్కగ వుంది.
చెంగు చెంగున గెంతుచున్నది.
అడవి అంతా తనదేనంది
ఏ జంతువుకు బయపడనంది.

లేడి గెంతులు చూసిన నక్క
నక్కి చూసింది ఓ ప్రక్క
వేసింది పక్కా ప్రణాళిక
రెచ్చగొట్టింది పులినింక.

రెండూకలిపి మాటువేసెను
ఒక్కసారిగ దాడి చేసెను
ప్రమాదాన్ని గమనించినలేడి
పరుగులో పెంచింది వాడి.

ఆనాటి దాడి తప్పిన లేడి
అప్రమత్తతను పెంచింది
నాటినుండి నేటివరకు
బెదురుతోనె జీవిస్తోంది.

23, డిసెంబర్ 2011, శుక్రవారం

క్రిస్ఠ్మస్ పండుగ.

రారాజు ఉద్భవించే
రాజ్యములను ఏలగ
రక్ష రక్ష ప్రజలకు
అతనిని ధ్యానింపగ

ఏసోబు మరియమ్మల
ముద్దు బిడ్డగ
క్రీస్తుజననమే మనకు
క్రిస్ఠ్మస్ పండుగ.

మానవత సమానత
తెలిపే ఈ పండుగ
శాంతి, క్రాంతి కలిపి
తేవాలి నిండుగ.

15, డిసెంబర్ 2011, గురువారం

తూనీగ....

తూనీగమ్మ...  తూనీగ..
మా పెరటిలో.. తూనీగ.
.
పక్షిలాంటిది..  తూనీగ.
పడితే దొరకని తూనీగ...

పొలంగట్ల పై   తూనీగ...
వర్షం తెచ్చే     తూనీగ...
.
దారం కడితే   తూనీగ...
గాలి పటం లే తూనీగ ..


పిల్లల నేస్తం    తూనీగ ....
రివ్వున ఎగిరే తూనీగ...

14, డిసెంబర్ 2011, బుధవారం

ఇంద్ర ధనస్సు

చిటపట చినుకులు
టప టప కురిసి
వాన వెలిసింది.

చల్లని గాలికి
నీటి భిందువు
వూగిసలాడింది.

తెల్లని కిరణం
ఏటవాలుగా
జాలువారింది.

ఆకాశంలో
ఇంద్రధనస్సు
వెల్లివిరిసింది.

బడిలో పిల్లలు
ఆశక్తిగా ఏడురంగులు
చూసారు

చక్కని పాఠం
తెలిసిందంటూ
సంతోషించారు.

13, డిసెంబర్ 2011, మంగళవారం

తెలుగు పాట


పాడాలని       వుంది తెలుగు పాట
మాటాడాలని వుంది తెలుగు మాట
అ..ఇ...ఉ...ఋ అను
అక్షరములు ఏబది ఆరు
అందు లొంచి జాలువారు
తెలుగు భాష నోరూరు.        /పా/

ఆరుద్ర....ఆత్రేయ
సి.నా.రే... సిరివెన్నల
సినీకవుల  గీ తాలను
నచ్చిన స్వరములు కట్టి
అందరు మెచ్చె విధముగ     /పా/

యండమూరి,   మల్లాది
యుద్దనపూడి ..మాదిరెడ్డి
నవలలన్ని తెచ్చుకుని
ఒకటొకటిగ చదువుకుంటు
కధలన్ని తెలుసుకుంటు.   /పా/

భారత... రామాయణాలు..
భాగవత...  పురాణాలు..
మనసుపెట్టి చదువుకుని
మర్మాలను తెలుసుకుని
మంచితనం పెంచుకుని   /పా/

భగవంతుని గీతాలను
భక్తి తోడ ఆలపించి
తెలుగు భాష తియ్యదనం
తేట తెల్ల మయ్యేట్టుగ
తెలుగు వెలుగు పండేట్టుగ
ఆ వెలుగు జిలుగు నిండేట్టుగ ../పా/

12, డిసెంబర్ 2011, సోమవారం

పరీక్షలు

బాలల్లారా.... బాలికలారా...
రండి...రా రండి.
పరీక్షలొచ్చే వెళాయె
ఫస్టుగ చదవండి.

అన్నివచ్చని తలవకుండగ
రానిది నేర్వండి
ఒక్కసారి వ్రాసారంటే
పదిమార్లు చదివినంతండి.


ఇష్టపడి చదివారంటె
ఎన్నడు మరుపే రాదండి
ఈనాడు కష్ట పడ్డారంటె
రేపటి భవితే మీదండి.

11, డిసెంబర్ 2011, ఆదివారం

శ్రమ జీవి - చీమ.

ప్రాణులలో చిన్నది
జ్ఞానమెంతొ వున్నది
కష్టపడి పనిచేసి
కూడ బెట్టు చున్నది.

కలిసి మెలిసి తిరుగుతూ
ఒక బారుగ కదులుతూ
స్నేహానికి అర్దాన్ని
చాటి చెప్పుచున్నది.

ఎదురెదురు పడగానే
పలకరింపులు
సోది చెప్పుకోకుండా
పనిముగింపులు.

నేర్చు కొంటె  చీమనుంచి
ఎంతో వుంది
క్రమ శిక్షణ మారుపేరు
చీమే  నండి.

10, డిసెంబర్ 2011, శనివారం

అందాల అరకులోయ.

అమ్మా,నాన్న, పిల్లలము
అరకు లోయకు వెళ్ళాము

రైలు బండి ఎక్కాము
కొండ గుహలను దాటాము
పూదోటలలొ నడిచాము
ధింసా నృత్యం చేసాము

బొర్రాగుహలను చూసాము
బోలెడు వింతలు కన్నాము

చలికి గడ గడ వణికాము
చప్పున రూముకు చేరాము

మా బడి.


చదువులమ్మ ఒడి
మాపల్లెలో బడి
నేర్పింది మాకు
ఓ మంచి నడవడి
పిల్లలకు వచ్చింది
ఓ కొత్త ఒరవడి

పాఠములలో ఫస్టు
పాట లందున ట్విస్టు
ఆటలపై ఇంట్రస్టు
మా స్కూలు ది బెస్టు

చక్కని బడి అంటె
అందరికి ముద్దు
చదివేటి పిల్లలకు
లేదండి హద్దు .

8, డిసెంబర్ 2011, గురువారం

సీతాకోకచిలక

గజిబిజి గొంగళి
పురుగును తెచ్చి
అగ్గిపెట్టెలో దాచాము
పచ్చని ఆకులు పెట్టాము
వెచ్చగ తలుపును మూసాము

లార్వా ప్యూపా దశలను చూసి
సీతా కోక చిలుకను చేసి
పువ్వుల తోటలొ వదిలాము
అల్లరి అల్లరి చేసాము
చల్లగ సేదతీరాము .

6, డిసెంబర్ 2011, మంగళవారం

నెమలి

అడవి లో చెట్టుమీద
అందమైన నెమలి వుంది
బారెడంత తోకతోటి
వనమంతా తిరుగుతోంది.

సూది వంటి ముక్కు తోటి
కాయ, గింజ కొరుకుతోంది
సన్ననైన గొంతుతోటి
రాగాలను పలుకుతొంది.

కారుమబ్బు కమ్మినపుడు
దాని ఆనందం పట్టలేము
పురివిప్పి నాట్యమాడ
అందం వెలకట్టలేము
.

5, డిసెంబర్ 2011, సోమవారం

సైకిలు

సైకిలమ్మ సైకిలు
అందరిదీ సైకిలు
ఇంధనంతొ పనిలేని
అందమైన సైకిలు

ఎవరైనా అడ్డొస్తే
ట్రింగ్ ట్రింగ్ బెల్లు
ఆపైనా ఫెడలేస్తే
దూసుకువెళ్ళు

రాత్రిపూట నడిపేందుకు
డైనమో లైటు
సడన్ గా ఆపేందుకు
బ్రెకుల సెట్టు

పేదా.. పెద్ద తేడా
లేని వాహనం
కాలుష్యం కలిగించని
ప్రయాణ సాధనం.



3, డిసెంబర్ 2011, శనివారం

రైలుబండి

చుక్ బుక్ చుక్ బుక్
రైలు బండి
ఎన్నో పెట్టెలు
లాగే బండి
ఎర్రని ఝండాకు
ఆగే బండి
పట్టాల మీద
నడిచే బండి

ప్రయాణానికి
చక్కని దండి.

2, డిసెంబర్ 2011, శుక్రవారం

అరటి మొక్క

నాన్నగారు నాటినారు
పెరటిలోన అరటిమొక్క
చూడముచ్చటగ ఉన్నది
చక్కనైన చిన్నిమొక్క.


లేతపచ్చ రంగు తోటి
ఆకులను అలిమింది
మొక్కనుండి తేనెవంటి
మొగ్గ తొంగి చూసింది.


మొగ్గనుండి అందమైన
అరటి గెల విరిసింది

తియ్యనైన పండ్ల తోటి
అరటి మొక్క మురిసింది.

1, డిసెంబర్ 2011, గురువారం

గడియారం

గణ గణ మోగే గడియారానికి
గంటలేమో పన్నెండు

గిర గిర తిరిగే టందుకున్నవి
ముళ్ళు రెండే రెండు

మనిషికి కాలం విలువని తెలుపు
ఏనాడు అది ఎరుగదు అలుపు
నీటి నీడా గడియారం
చేతి, గోడ గడియారం

లేకుంటే మరి గడియారం
తెలియదు కాలం కొలమానం
రంగు రంగుల గడియారం
మనిషి చేతికో మణిహారం.

28, నవంబర్ 2011, సోమవారం

చదువు కోర చక్కగా.

చదువుకోర చిన్నిబాబు
చదువుకోర చక్కగా
చదువుకొని భవిష్యత్తును
దిద్దుకో ఇంచక్కగా

ఉదయం నిద్దురలేచి
పండ్లు తోమి పాలుతాగి
పుస్తకాన్ని చేతబట్టి
చదువుకోర చక్కగా

చన్నీటి స్నానమాడి
చలువ దుస్తులను తొడిగి
భగవంతుని ప్రార్దించి
బడికిపోర చక్కగా

బడినె గుడిగా తలచి
పాఠాలను నెర్చుకొని
అమ్మా,నాన్నలకు పేరు
తెవాలిర చిన్నా!


27, నవంబర్ 2011, ఆదివారం

చక్కని మొక్కలు

మొక్కలు పెంచాలోయ్
చక్కని మొక్కలు పెంచాలి!

గొతులు తీసి,పాయలుచేసి
నీరుని ఫొసి, నారునువేసి
మొక్కలు పెంచాలోయ్
చక్కని మొక్కలు పెంచాలి!

నీడనిచ్చేటి, ఫలములిచ్చెటి
ఇంటి నిర్మాణ కలపనిచ్చేటి
పచ్చనైన ఆ ప్రకృతిచ్చేటి
ప్రాణమైన ఆ వాయువిచ్చేటి

పువ్వులిచ్చేటి,కాయలిచ్చేటి
పర్యావరణపు రక్షణిచ్చేటి
మొక్కలు పెంచాలోయ్
చక్కని మొక్కలు పెంచాలి!

26, నవంబర్ 2011, శనివారం

కుక్కపిల్ల

కుక్కపిల్ల కుక్కపిల్ల
తెల్లజూలు కుక్కపిల్ల
పాలు పోస్తే త్రాగుతుంది
ఆటలెన్నొ ఆడుతుంది

తెలియని వారొచ్చారా
దాన్నిపట్టు కోలెము
తనవారని తెలుసుకుందా
ప్రేమ తట్టుకోలేము

రాతిరంత తిరుగుతుంది
బోర్డరు లో సిపాయిలా
ఉదయం నిదరోతుంది
ఉయ్యాలలొ పాపాయిల

విశ్వాసం మారుపేరు
దీనికెవరు సాటిరారు.

25, నవంబర్ 2011, శుక్రవారం

చదువు- పిల్లలు

పిల్లలపై పెంచకుమా
పుస్తకాల భారం
నువ్వు చదివినపుడుందా
ఇంత చెడ్డఘోరం !

వీధిబడిలో చదివి
నేనింత వాడినైనానని
దీపపు స్తంబం క్రిందె
నాచదువు గడిచిందని

గొప్పలు చెప్పె పెద్దలు
గమనించారా ఇది
చదవ లేక చతికిలపడు
పిల్లవాని పరిస్థితి

ఇష్టం లేని చదువులు
కష్టంగా చదువుతున్న
పష్టుగ రాలేదంటు
నిష్టూరం వేయకండి !

పోటీ తత్వం పెరిగి
ఆందోళనలు కలిగి
జీవితాన్ని సగంలోనే
ముగింఛేటి విద్యార్దుల

భవిష్యత్తు తీర్చిదిద్దు
భాద్యత తలితండ్రులదె
సరియగు గమ్యం చూపె
భాద్యత గురుదేవులదే

పిల్లలలొ పెంచండి
ప్రేమా అభిమానం
అప్పుడే పెరుగుతుంది
అసలగు విజ్జానం !

23, నవంబర్ 2011, బుధవారం

బాల్యం

మోయలేని బరువులు
మన పిల్లల చదువులు
చదవనంటె వెస్తారొయ్
వీపు మీద దరువులు !


ఉదయం నిద్దురలేచి
గబగబ స్తానం చేసి
తిన్నదేంటొ తెలీకనే

ప్రైవేటుకు పరుగులు !

ఎల్.కె.జి తోనె ఆలొచనలు
చిన్ని చిన్ని చదువులకే సులొచనాలు

ప్రతినిముషం తల్లి తండ్రుల హితవచనాలు
బాల్యం అంతా చక్కగ గడిస్తే చాలు  !

క్లాసువర్కు హొంవర్కు
ప్రతిరోజు రిస్క్
కాన్వెంటు చదువులొనె
కంప్యూటర్ కిక్ !


బాల్యం ఓ సుడిగుండం
అవుతోందోయ్ యమగండం
ఎదైనా బడి గండం
కాకుంటె చాలును దండం !

21, నవంబర్ 2011, సోమవారం

కాకిబావ- రైలుబండి.


ఈపాట కూడా అమ్మపాడింది.నా రచన కాదు దీని రచన కూడా ఎవరొ తెలీదు.

రైలు సికినలు చెంత రావిచెట్టుంది
రావిపై నొక కాకిబావ కూర్చుంది
వచ్చిపోయె రైలు వంక చూసింది
రైలు రావడమున్ను బయలు దేరడము.

గమనించి మురిసి రెక్కలు కొట్టుకుంది.
బలగమ్ము నొకనాడు పిలువనంపింది.
రైలు నె రమ్మంటె రావలెనంది
పొమ్మంటె తుర్రున పొవలెనంది.

గమ్మత్తు లెమ్మంది కాకిబలగమ్ము
గమ్మత్తు కాదంటు కాకి బావపుడు
సికినలు చెక్క లెవడం చూసి
రావోయి రావోయి రైలు బావంది

గుప్పుగుప్పున రైలు కూస్తు వచ్చింది
స్టేషను రైలు సేదతేరింది.
గార్దు విజిలేయడం గమనించి కాకి
పంపించి వేస్తున్న చూడండి

పోవోయి పోవోయి పొగరాయుడంది
రైలు గుబ గుబ మంటు బయలు దేరింది.
పొగడ లేక చచ్చె కాకి బలగమ్ము
వినలేక చచ్చెరా మన కాకి బావ.

ఆటలు

చిన్నతనపు ఆటలన్ని
చిత్రమైనవి
తలచుకొంటె మనసు
పులకరింపచెస్తవి!


కోతీకొమ్మచ్చులాట
దాగుడు మూతల ఆట
ఉప్పుపట్టి ఉయ్యాల
ఏడు పెంకులాట !


గాలిలోకి గాలిపటం
ఎగరేసే గమ్మత్తులు
ఉత్తరాలు పంపుతుంటె
తొటివారి కేరింతలు!


ఆడపిల్లలాడు కొనె
తొక్కుడుబిళ్ళట
కాయతొ కాయకొట్టు
గోళీ లాట !


ఎమైనా ఆటలు
మనసుకు హాయినిస్తవి
ఆరోగ్యానికి ఎంతొ
మేలు చేస్తవి!

19, నవంబర్ 2011, శనివారం

అమ్మ ప్రేమ

నల్లానల్లని కాకమ్మ
సన్నని పుల్లలు తెచ్చింది
చెట్టుకొమ్మన పెర్చింది
చక్కని గూడును కట్టింది
పచ్చని ఆకులు చెర్చింది
గూడును వెచ్చగ చేసింది
తెల్లని గుడ్లను పెట్టింది
ఎర్రని పిల్లలు చేసింది

కాకి పిల్లలు కాకికి ముద్దు
అమ్మప్రేమకు లెదుర హద్దు.

18, నవంబర్ 2011, శుక్రవారం

మా మంచి ఊరు

అమ్మమ్మ ఇంటికి పొదాము
అక్కడ వింతలు చూద్దాము
పల్లెల లో చల్లదనం
చక్కక ఆస్వాదిద్దాము


పాడి పంటల నిలయాలు
పచ్చని తోటల వలయాలు
నీటితొ నిండిన చెరువులు, సరసులు
నిత్యం పూసే పువ్వుల తోపులు


పక్షుల కిలకిల రావాలు
గుడిలొ గంటల గణగణలు
ఆప్యాయంగా పలకరింపులు
ఆదరించేటి మంచిమనసులు


వేసవి గడిపె చక్కని విడుదులు
వర్ణింప లేనివి పల్లెసొగసులు
సెలవలు అక్కడ గడిపెస్తాం

బడులు తీసాక తిరిగొస్తాం.

16, నవంబర్ 2011, బుధవారం

తీతువు

పిల్లల మీద ప్రేమ, ఆడవారి లో వుండె భయము తెలుపుతూ నా చిన్నప్పుడు అమ్మ పాడిన పాట.
ఇది నా రచన కాదు. ఎవరు రాసారొ తెలియదు.

చిటారు కొమ్మల చిగురుల్లొ
మిఠాయి పొట్లం మొస్తరుగా
తీతువు గూడును కట్టింది
తెల్లని గుడ్లను పెట్టింది.

పిన్నమి చొరబడ కుండగనె
బొరెడు పిల్లలు చెసింది
మగపిట్టఒకనాడెందులకొ
మధ్యరాత్రికిల్లు చెరింది

వచ్చిన భర్తను చూసింది
వలవల పెండ్లామెడ్చింది
ఎమని మగపిట్టడిగింది
మిన్నువిరిగి పైబడితేనొ
కన్నభిడ్డలెమౌతారొ

ఈభాగ్యమ్మున కంటెను
ఎడుస్తూ కూర్చున్నావు
కాళ్ళు మింటి వంకకు జాపి
కన్ను గునకక పొయావా

మరిచి తప్పి పై బడితేను
దాని మదమనగించక పొయెనా
అంటూ తనకాళ్ళుటుజాపి
ఆలిని నిద్దుర పుచ్చింది

భళ్ళున తెల్లవారింది
పక్షులు నిద్దుర లేచినవి
పడితె చెడుతుందను కుంటు
పక పక నవ్వుకున్నాయి

తెలిసి తెలియని మిణుగులతొ
దిగులు చెందుతారాడంగుల్.



15, నవంబర్ 2011, మంగళవారం

మధురం

పలుకు మధురం
పాట మధురం
కొమ్మల్లో కొయిలమ్మ
కూతమధురం

రాతలు మధురం
చేతలు మధురం
అందాల మాపాప
మాటలు మధురం

రూపు మధురం
చూపు మధురం
చిన్నారి చిలకమ్మ
ఆట మధురం

నడక మధురం
నడత మధురం
చిన్నారి మాపాప
మనసు మధురం

14, నవంబర్ 2011, సోమవారం

కత్తి పడవ

వానా వానా రావమ్మ
చల్లని నీటిని తేవమ్మ
మొక్కలు చక్కగ పెరగాలి
చల్లని గాలులు వీచాలి
ప్రకృతి పచ్చగ వుండాలి
పిల్లకాలువలు పారాలి
బడికి సెలవలు రావాలి
బాలలందరం ఆడాలి

కత్తి పడవలు చెయ్యాలి
ఆ కాలువలోనా వెయ్యాలి.

13, నవంబర్ 2011, ఆదివారం

రేపటి పౌరులు

పూసిన పువ్వులు
ఎగిరే గువ్వలు
మెరిసిన తారలు
చిన్నారి బాలలు

బుడి బుడి నడకలు
తడబడు పలుకులు
చిరు చిరు నవ్వుల
చిన్నారి బాలలు

సిరిసిరి మువ్వలు
ఇంటిన దివ్వెలు
నింగిని తాకే
తార జువ్వలు

అమ్మా నాన్నల
కలల పంటలు
రేపటి పౌరులు
చిన్నారి బాలలు

10, నవంబర్ 2011, గురువారం

తెలుగు

అ ఆ ఇ ఈ అంటూనే
అక్షరాలను నేర్చెస్తాం
అమ్మ ఆవు ఇల్లు వంటి
పదాలను కూర్చెస్తాం !


తియ్యనైన తెలుగు భాషను
అందరి నోట పలికిస్తాం
మాతృ భాష లొ మాధుర్యాన్ని
మనసులందూ నిలిపేస్తాం !


ఇతర భాషలు ఎన్నున్నా
తెలుగే శహభాషే అనిపిస్తాం
చిన్నపిల్లలం అయినా మేము

తెలుగు భాషను రక్షిస్తాం !


8, నవంబర్ 2011, మంగళవారం

మల్లెలము

పిల్లలము పసి పిల్లలము
చల్లని తెల్లని మల్లెలము
జాబిలి తెచ్చిన వెన్నెలము
జాతిపతాకపు రంగులము

అల్లరి అన్నది మే మెరుగం
ఆట పాటలలొ ముందుంటాం
అమ్మా నాన్నల ఆశలు తీర్చగ
చదువును చక్కగ చదివేస్తాం

పాఠశాల పరిశుభ్రం చేస్తాం
పచ్చని మొక్కలు పెంచేస్తాం
గురువుకు నమస్తీ చెప్పేస్తాం
చదువుకు గులాము లౌతాము

7, నవంబర్ 2011, సోమవారం

గారాల బొమ్మ

మా ఇంట పుట్టింది
అందాల పాప
చిరునవ్వు నవ్వింది
వెలుగెంతొ నింప

బుడి బుడి అడుగులను
వడి వడిగ నేర్చింది
తడబడె పలుకులను
ముదమార కూర్చింది

తొటి పిల్లల తోటి
ఆటలె ఆడింది
ముద్దుమాటలతొ
పాటలె పాడింది

పలక పై బలపంతొ
సున్నాలు చుట్టింది
పుస్తకాలను చింపి
మారాము చెసింది

అల్లరెంతయినా ఆ
అందాల రెమ్మ
ఇంటిల్లి పాదికి
గారాల బొమ్మ

6, నవంబర్ 2011, ఆదివారం

పుట్టిన రోజు

బుడగలు బూరలు కట్టిన రోజు
బిస్కట్ చాక్లెట్ పంచిన రోజు


బందువులంతా వచ్చినరోజు
బహుమతులెన్నొ తెచ్చినరోజు


పిస్తాకేకును కొసినరోజు
పిల్లలు అల్లరి చేసిన రోజు


అమ్మపాయసం వండినరోజు
ఆనందంగా గడిపిన రోజు
చిరునవ్వులు చిందించిన రోజు
చిట్టి చెల్లాయి పుట్టిన రోజు


 

5, నవంబర్ 2011, శనివారం

ఓ పాప లాలి

ఓ పాప లాలి నా బుజ్జి లాలి

నీవు ఎల్లప్పుడూ నవ్వుతుండాలి
నాన్న తోడుండగా స్నానమాడాలి

పాపాయి లాలి పాలు తాగాలి
అన్న ఆడించంగ ఆటలాడాలి


నా చిట్టిలాలి నడక నేర్వాలి
నట్టింట మా లక్ష్మి  నాట్యమాడాలి


జో జో లాలి అమ్మపాడాలి
అప్పుడే పాపాయి నిదురపోవాలి.

4, నవంబర్ 2011, శుక్రవారం

పసి మనసులు

పసిపిల్లల చిరునవ్వులు
విరబూచిన మరుమల్లెలు

పసిమనసుల తొలిపలుకులు
తేనె లొలుకు రసగుళికలు

తడబడు ఆ చిరునడకలు
చైత్రమాస చిరుజల్లులు

కాంతులు చిందేకన్నులు
సిరివెన్నెల తొలివిందులు 
 చిరుప్రాయపు ప్రాణదూపం
పరమాత్ముని ప్రతిరూపం


3, నవంబర్ 2011, గురువారం

తారక

ఆకాశం లొ వుంది
నక్షత్రపు మాలిక
ఆవలి వైపున వున్నది

పాలపుంత చూడగ
వింతలెన్నొ చూసేందుకు
ఆకాశం వేదిక
ఎంత చూసినా సరే
అంతులేని వింతగ

సూర్య చంద్ర గ్రహములకె
చొటిచ్చిన స్దలమిది
నక్షత్రపు పువ్వులనె
పూయించె వనమది

మేధావులకే అందని
ముచ్చటైన మండలం
దాని కధను వింటుంటె
మనకెంతొ సంభరం

2, నవంబర్ 2011, బుధవారం

చందమామ

అందమైన చందమామ
ఆకశంలొ వుంది చూడు
చుక్కలతొ సరదాగా
ఆటలాడు తోంది చూడు
వెన్నెలంత పిండి లాగ
వెదజల్లె తీరు చూడు
పిల్లలంత పాట పాడ
పరుగులు పెడుతోంది చూడు
నల్లని మేఘాలతొటి
దోబూచుల ఆటచూడు
రాతిరంత ఆడినా
అలసిపోడుఏనాడు
అందువలన చందమామ
ఆకాశానికి రేడు
పిల్లలంత ఇష్టపడె
చక్క నైన స్నెహితుడు.

1, నవంబర్ 2011, మంగళవారం

జడివాన

చిటపట చినుకులతో
జల్లు కురిసింది
చిరుజడివానలతో
పల్లె మురిసింది

ఏడు రంగుల ఇంద్రదనస్సు
వంగి చూసింది
అల్లరి చేసె పిల్లకాలువ

పొంగి పొరలింది
తరగతి గదులు తడిసి
పిల్లల మనసు ఎగిసింది
తడసి ముద్దయి పిల్లల
బారు పరుగు తీసింది.

ఓ బాలలారా.

చదివింది రాయండి
రాసింది చదవండి
అర్దమైయ్యె రీతి
ఓ బాలలార

ఆటలు ఆడండి
పాటలు పాడండి
అందరు మెచ్చగా
ఓ బాలలారా

క్రొంగొత్త విషయాలు
కనిపెట్ట గా రండి
శాస్త్ర వేత్తలు మీరు
ఓ బాలలార

భావి భారతాన
నేతలె మీరండి
శాంతిదూత లాగ
ఓ బాలలారా.

30, అక్టోబర్ 2011, ఆదివారం

పల్లె- పాప

పసిపాప నవ్వులా పల్లె ఎంత అందం
చిన్నితల్లి పలుకులా వేస్తుంది భందం.
చిట్టిపాప నడకలా గలగల సెల ఏరు.
చిన్ని పాప ఆటలా తల వూపును పైరు.
తడబడు ఆ చిరునడకలు లేగదూడ గెంతులు
చిన్నితల్లి కెరింతలు కొకిలమ్మ పాటలు
బోసి నోరు తలపించును సరసులోని తామరలు

బుంగమూతి మురిపించును లేతమావి పిందెలు
చిట్టీపాప స్నానమాడ ఇల్లంతా సందడి
చిరుజల్లులు కురియువేల పల్లంతా సవ్వడి.

21, అక్టోబర్ 2011, శుక్రవారం

దీపావళి
పిల్లల ఆల్లరి తోటి
సందడి చేసే పండుగ
నిండుగ దీపాల తోటి
వెలిగే వెన్నెల పండుగ
నరకుని వధ జరిగిందని
చీకట్లు తొలగాయని
సంప్రదాయ బద్దముగ
దివిటీ కొట్టె పండుగ
టపాసులు మతాబులు
సిసింద్రీలు ఛిచ్చు బుడ్లు
చిట్టిపాప ఇష్టపడే
కాకర పువ్వొత్తులు   
ఊరంతా దీపాలు 
మనసున సంతోషాలతో
అమావాస్య పౌర్ణమిగా
మలచే దివ్వెల  పండుగ
పెద్దలను పిల్లలుగా
మార్చే దీపావళి 
పిల్లల మనసును దోచే
చక్కని దీపావళి 

  

20, అక్టోబర్ 2011, గురువారం

Balageetam

Deepavali
Pillala Allari thoti
Sandadi Chese Panduga
Ninduga Deepala thoti
Velige vennela Panduga
Narakuni Vadha Jarigindhani
Cheekatulu tholagayani
Sampradaya Bhaddamuga
Divite Kotte Panduga
Tapasulu Matabulu
Sisindreelu Chichubudlu
Chittipapa Istapade
Kakara Puvvathulu
Vurantha Deepalatho
Manasuna Santhoshalatho
Amavaysa Powrnamiga
Malache Divvela Panduga
Peddalanu Pillaluga
Marche Deepavali
Pillalu Manasuni dhoche
Chakkani DEEPAVALI