21, అక్టోబర్ 2011, శుక్రవారం

దీపావళి
పిల్లల ఆల్లరి తోటి
సందడి చేసే పండుగ
నిండుగ దీపాల తోటి
వెలిగే వెన్నెల పండుగ
నరకుని వధ జరిగిందని
చీకట్లు తొలగాయని
సంప్రదాయ బద్దముగ
దివిటీ కొట్టె పండుగ
టపాసులు మతాబులు
సిసింద్రీలు ఛిచ్చు బుడ్లు
చిట్టిపాప ఇష్టపడే
కాకర పువ్వొత్తులు   
ఊరంతా దీపాలు 
మనసున సంతోషాలతో
అమావాస్య పౌర్ణమిగా
మలచే దివ్వెల  పండుగ
పెద్దలను పిల్లలుగా
మార్చే దీపావళి 
పిల్లల మనసును దోచే
చక్కని దీపావళి 

  

1 కామెంట్‌:

  1. మిత్రమా! ప్రతి శుభ కార్యమునకు ముందు జ్యోతి వెలిగించుట మన సంప్రదాయం.అనుకోకుండా మీబ్లాగు ' దీపారాధన' తో మొదలైనది. ఈ వెలుగు దినదిన ప్రవర్ధమానమై తెలుగు వారి మది నిండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలతో...

    తే.గీ: ' బాలగీతమ్ము' పేరున బ్లాగు తెరచి
    పిల్లలల్లరి చేష్టల వెలుగు నింపి
    మొదటి కవితను వెలిగించి మురిసినారు
    బ్లాగు నిరతము వెలుగును బాగు బాగు.

    రిప్లయితొలగించండి