11, డిసెంబర్ 2011, ఆదివారం

శ్రమ జీవి - చీమ.

ప్రాణులలో చిన్నది
జ్ఞానమెంతొ వున్నది
కష్టపడి పనిచేసి
కూడ బెట్టు చున్నది.

కలిసి మెలిసి తిరుగుతూ
ఒక బారుగ కదులుతూ
స్నేహానికి అర్దాన్ని
చాటి చెప్పుచున్నది.

ఎదురెదురు పడగానే
పలకరింపులు
సోది చెప్పుకోకుండా
పనిముగింపులు.

నేర్చు కొంటె  చీమనుంచి
ఎంతో వుంది
క్రమ శిక్షణ మారుపేరు
చీమే  నండి.

2 కామెంట్‌లు:

  1. భలే బాగుందండీ, మీ గీతాలన్నీ హాయిగా చిన్నపిల్లలు పాడుకోటానికి ఎంతో సులభంగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  2. చిన్ని ఆశ గారు,
    పిల్లల పాటలు ఎంతో హాయి
    మీకు నచ్చినందుకు చాలా
    సంతోషం.

    రిప్లయితొలగించండి