22, మార్చి 2012, గురువారం

శ్రి నందన నామ సంవత్సర ఉగాది.

వచ్చింది వచ్చింది ఉగాది.
వేస్తుంది కొత్త కొత్త ఆశలకు పునాది.


"నందన" శుభనామమై
అభినందన తెలుపుతూ
చందన సిరి గంధాలతో
అందముగా మనముందుకు
    //వచ్చింది//

నవవసంత చిరుజల్లు తో
ఎలమావుల పరిమళాలు
చిరుకొమ్మల తెరచాటున
వనకోకిల గానాలతొ
               //వచ్చింది//

లేతమావి వగరుకు
కొత్త చింతపులుపుతో
వేపచేదుకలుపుతూ
చెరకు తీపి తెలుపుతూ
         //వచ్చింది//


జీవనగమనములో భాధలన్ని చేదుగా
సంతొషం తీపిగా... చిరుకలతలు వగరుగా
చింతలన్ని ఫులుపుగా...
పరమార్ధం వెల్లడించు
పచ్చడి తో మనముందుకు
    //వచ్చింది//


తెలుగు కవుల మదినిండుగ
నవ్యకవిత వెళ్ళి విరియ
పండిత పంచాగ శ్రవణ
వేదిక కళ కళలాడగ
           //వచ్చింది//


శుభాలెన్నో కలిగిస్తూ
సాగాలీ ఈ ఉగాది
అనాదిగా తెలుగువారి
తొలి పండుగ యుగాది
...


ప్రియ మిత్రులకు...
ఉగాది  శుభాకాంక్షల తో
కూచిమంచి.


2 కామెంట్‌లు:

  1. కూచి'మంచి' వారూ ! అందుకోండి మీ నందన కవితకు అభినందన.

    ఆ నందుని నందను దయ
    ఈ నందన వత్సరమ్ము నేకాలమ్మున్
    ఆనంద మందు డెందము
    ఆ నందీశ్వర గమనుడు హాయిగ బ్రోచున్.

    రిప్లయితొలగించండి
  2. మీ కవిత శుభాకాంక్షలకు
    మా అభివందనములు.

    రిప్లయితొలగించండి