12, జనవరి 2012, గురువారం

మన పండుగలు

గొబ్బెమ్మలతోనిండుగ
ముందుగవచ్చేపండుగ
భోగిమంటలు,బొమ్మలకొలువుతో
పిల్లలు మెచ్చేపండుగ.
                   భోగిపండుగ.
ముగ్గులువేసేపండుగ
ముచ్చటగొలిపేపండుగ
అంబరమంత సంబరమిచ్చే
మకరసంక్రాంతి పండుగ
                సంక్రాంతిపండుగ
కాంతులు నింపే పండుగ
కార్మిక , కర్షక పండుగ
విందులతొ సందడి చేసే
కమ్మని కనుమపండుగ.
                కనుమ పండుగ.
మూడు పండుగలు ముచ్చటైనవి
తెలుగువారికి ముఖ్యమైనవి
సంప్రదాయాలు చాటుచున్నవి.
సర్వశుభాలను తెచ్చుచున్నవి..

10 కామెంట్‌లు:

  1. పండుగ సంబరమంతా కవితలో కనిపిస్తు౦దండీ..చాలా చక్కగా వ్రాశారు. మీక్కోడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జ్యొతిర్మయి గారు,
      చాలా సంతొషంగా వుంది.
      మీ స్పందన ఛూసి.
      మరొక సారి సంక్రాంతి శుభాకాంక్షలు.

      తొలగించండి
  2. చక్కగా చెప్పారు. సంక్రాంతి శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  3. రసజ్ఞ గారు,
    పండుగలలొ పెద్దది.
    పల్లెలలొ చూడముచ్చటైనది.
    సంక్రాంతి.
    మరొక సారి సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. కూచి'మంచి' వారూ! చక్కని కవితతో సంక్రాంతి శోభ తెచ్చారు. భోగి శుభా కాంక్షలతో..
    ఆట వెలది:
    పనికి రాని చెత్త పరమ దారిద్ర్యంబు
    కాల్చి వేయ మనకు కలుగు సిరులు
    క్రొత్త ఆశ లేవొ కోరక చిగురించు
    భోగములకు పంట భోగిమంట.

    రిప్లయితొలగించండి
  5. పండుగ గురించి బాగా చెప్పారు .
    సంక్రాంతి శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాలా గారు,
      మీ అబిమానానికి నా నమస్సుమాంజలి.
      మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.

      తొలగించండి
  6. కూచిమంచి వారి కవితతో సంక్రాతి,
    మధుర ఊహలోంచి మెరిసెగాని,
    నాగహీలగక్కు నాగరీకమ్ములో,
    నిగిడి నిలువగలదె నాటివిలువ.

    --డి.యస్.రెడ్డి

    రిప్లయితొలగించండి
  7. రెడ్డి గారు,
    ప్రవేశించారు బ్లాగులోకి
    ఇక వెదజల్లండి కవితల
    పరిమళాలు.. అందరికి అందేలా...

    రిప్లయితొలగించండి