26, నవంబర్ 2011, శనివారం

కుక్కపిల్ల

కుక్కపిల్ల కుక్కపిల్ల
తెల్లజూలు కుక్కపిల్ల
పాలు పోస్తే త్రాగుతుంది
ఆటలెన్నొ ఆడుతుంది

తెలియని వారొచ్చారా
దాన్నిపట్టు కోలెము
తనవారని తెలుసుకుందా
ప్రేమ తట్టుకోలేము

రాతిరంత తిరుగుతుంది
బోర్డరు లో సిపాయిలా
ఉదయం నిదరోతుంది
ఉయ్యాలలొ పాపాయిల

విశ్వాసం మారుపేరు
దీనికెవరు సాటిరారు.

4 కామెంట్‌లు:

  1. కూచి'మంచి' వారూ! మీ తెల్ల జూలు కుక్కపిల్ల నచ్చిందండీ!

    ఆటవెలది:
    కుక్క పిల్ల జూడ చక్కగా నుండును
    పాలుబోయ త్రాగు బాగు గాను
    ఇంటివారి నెపుడు నంటియే యుండును
    క్రొత్త వారు రాగ కొరుకు కాలు.

    రిప్లయితొలగించండి
  2. శాస్త్రి గారు,
    మీరు ఇలాగే ప్రొత్సహిస్తే
    మరిన్ని కవితలు రాయగలను.
    నాగేంద్ర.

    రిప్లయితొలగించండి
  3. సాయి
    థాంక్యు వెరీ మచ్.
    నాగేంద్ర.

    రిప్లయితొలగించండి