23, నవంబర్ 2011, బుధవారం

బాల్యం

మోయలేని బరువులు
మన పిల్లల చదువులు
చదవనంటె వెస్తారొయ్
వీపు మీద దరువులు !


ఉదయం నిద్దురలేచి
గబగబ స్తానం చేసి
తిన్నదేంటొ తెలీకనే

ప్రైవేటుకు పరుగులు !

ఎల్.కె.జి తోనె ఆలొచనలు
చిన్ని చిన్ని చదువులకే సులొచనాలు

ప్రతినిముషం తల్లి తండ్రుల హితవచనాలు
బాల్యం అంతా చక్కగ గడిస్తే చాలు  !

క్లాసువర్కు హొంవర్కు
ప్రతిరోజు రిస్క్
కాన్వెంటు చదువులొనె
కంప్యూటర్ కిక్ !


బాల్యం ఓ సుడిగుండం
అవుతోందోయ్ యమగండం
ఎదైనా బడి గండం
కాకుంటె చాలును దండం !

4 కామెంట్‌లు:

  1. మీరు పిల్ల గురించి బాధ పడితే పెద్దల గురించి నేను బాధ పడుతున్నా !

    ఎల్కేజీ సీటు కోసం ఎలెవన్ కేజీ లు తగ్గి పోయే బాబూ రావులు
    పిల్లోడి డ్రెస్సుల కోసం అడ్రస్సు లేక పోయిన అప్పారావులు
    చంటి లంచు కోసం వంట గదికి అంకితమైన చంద్రకాంతలు
    బంటి సింగారింపు కోసం బర్న్ అవుటు అయిన భామామణులూ....

    ఇలా చెప్పుకూ పోవచ్చన్న మాట !

    చాల బాగా వ్యక్తం చేసారు , బాల్యం గురించి.

    ప్చ్, బాల్యం , మిస్సవుతున్న బాలలు, ఆల్రెడీ టూ ఎజేడ్ ఫార్ ఎవ్వేరీ తింగ్ !

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  2. జిలెబి గారు
    మీ వాఖ్యకు నా ధన్యవాదములు.
    నేటి బాలలే రేపటి పౌరులు అనె విషయం మరిచారా
    ఇలాగె వుంటె రెండు విదములుగా భాదపడాలి సుమా
    నాగేంద్ర.

    రిప్లయితొలగించండి
  3. చదివేది ఎల్కేజీ
    పుస్తకాల బరువు టెన్ కేజీ
    ఫీజు వేలల్లో ప్యాకేజీ
    మార్నింగ్ తల్లి బిజీ బిజీ
    తండ్రికి హోం వర్క్ గజి బిజీ
    వచ్చిందా టీనేజీ
    లక్షల తోనే కాలేజీ
    ఇంకేం చెప్పను నాగేంద్ర జీ !
    మీ బాల్యం కవిత వహ్వాజీ !!

    రిప్లయితొలగించండి
  4. గోలీజీ ని
    ముకుదాడు తో లాగింది జిలేబీజీ !
    మరో కవితాజీ జాలువారింది శాస్త్రీజీ !

    రిప్లయితొలగించండి