21, నవంబర్ 2011, సోమవారం

కాకిబావ- రైలుబండి.


ఈపాట కూడా అమ్మపాడింది.నా రచన కాదు దీని రచన కూడా ఎవరొ తెలీదు.

రైలు సికినలు చెంత రావిచెట్టుంది
రావిపై నొక కాకిబావ కూర్చుంది
వచ్చిపోయె రైలు వంక చూసింది
రైలు రావడమున్ను బయలు దేరడము.

గమనించి మురిసి రెక్కలు కొట్టుకుంది.
బలగమ్ము నొకనాడు పిలువనంపింది.
రైలు నె రమ్మంటె రావలెనంది
పొమ్మంటె తుర్రున పొవలెనంది.

గమ్మత్తు లెమ్మంది కాకిబలగమ్ము
గమ్మత్తు కాదంటు కాకి బావపుడు
సికినలు చెక్క లెవడం చూసి
రావోయి రావోయి రైలు బావంది

గుప్పుగుప్పున రైలు కూస్తు వచ్చింది
స్టేషను రైలు సేదతేరింది.
గార్దు విజిలేయడం గమనించి కాకి
పంపించి వేస్తున్న చూడండి

పోవోయి పోవోయి పొగరాయుడంది
రైలు గుబ గుబ మంటు బయలు దేరింది.
పొగడ లేక చచ్చె కాకి బలగమ్ము
వినలేక చచ్చెరా మన కాకి బావ.

3 కామెంట్‌లు:

  1. కాకీ బావ ఆకసాన ఎగిరేనంట,
    మనం బళ్ళకి లగెత్తినామంటా !

    చాలా బాగుందీ, రాసినవారెవరో, చాలా ఈజీ గా , రాసారు, మంచి ఘటికులే అయ్యుండాలి ! ( నా లా అన్నమాట) !

    చీర్స్

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  2. జిలెబి గారు మరియు సౌమ్యగారు.
    మీ వాఖ్యకు నా ధన్యవాదములు.

    నాగేంద్ర.

    రిప్లయితొలగించండి