19, నవంబర్ 2011, శనివారం

అమ్మ ప్రేమ

నల్లానల్లని కాకమ్మ
సన్నని పుల్లలు తెచ్చింది
చెట్టుకొమ్మన పెర్చింది
చక్కని గూడును కట్టింది
పచ్చని ఆకులు చెర్చింది
గూడును వెచ్చగ చేసింది
తెల్లని గుడ్లను పెట్టింది
ఎర్రని పిల్లలు చేసింది

కాకి పిల్లలు కాకికి ముద్దు
అమ్మప్రేమకు లెదుర హద్దు.

2 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది. అమ్మ ప్రేమ కన్నా తీయ్యనిది ఇంకేదియు లేదు.

    రిప్లయితొలగించండి
  2. కూచి 'మంచి' వారూ ! అమ్మ ప్రేమ గురించి కమ్మగా చెప్పారు.

    అమ్మ ప్రేమమించు నంత తీయనిదేది
    ఒడిని మించినట్టి గుడియదేది
    గోరు ముద్ద కన్న కోరు వరమ్మేది
    మహిని యమ్మ మించు మహిమదేది.

    రిప్లయితొలగించండి