28, నవంబర్ 2011, సోమవారం

చదువు కోర చక్కగా.

చదువుకోర చిన్నిబాబు
చదువుకోర చక్కగా
చదువుకొని భవిష్యత్తును
దిద్దుకో ఇంచక్కగా

ఉదయం నిద్దురలేచి
పండ్లు తోమి పాలుతాగి
పుస్తకాన్ని చేతబట్టి
చదువుకోర చక్కగా

చన్నీటి స్నానమాడి
చలువ దుస్తులను తొడిగి
భగవంతుని ప్రార్దించి
బడికిపోర చక్కగా

బడినె గుడిగా తలచి
పాఠాలను నెర్చుకొని
అమ్మా,నాన్నలకు పేరు
తెవాలిర చిన్నా!


27, నవంబర్ 2011, ఆదివారం

చక్కని మొక్కలు

మొక్కలు పెంచాలోయ్
చక్కని మొక్కలు పెంచాలి!

గొతులు తీసి,పాయలుచేసి
నీరుని ఫొసి, నారునువేసి
మొక్కలు పెంచాలోయ్
చక్కని మొక్కలు పెంచాలి!

నీడనిచ్చేటి, ఫలములిచ్చెటి
ఇంటి నిర్మాణ కలపనిచ్చేటి
పచ్చనైన ఆ ప్రకృతిచ్చేటి
ప్రాణమైన ఆ వాయువిచ్చేటి

పువ్వులిచ్చేటి,కాయలిచ్చేటి
పర్యావరణపు రక్షణిచ్చేటి
మొక్కలు పెంచాలోయ్
చక్కని మొక్కలు పెంచాలి!

26, నవంబర్ 2011, శనివారం

కుక్కపిల్ల

కుక్కపిల్ల కుక్కపిల్ల
తెల్లజూలు కుక్కపిల్ల
పాలు పోస్తే త్రాగుతుంది
ఆటలెన్నొ ఆడుతుంది

తెలియని వారొచ్చారా
దాన్నిపట్టు కోలెము
తనవారని తెలుసుకుందా
ప్రేమ తట్టుకోలేము

రాతిరంత తిరుగుతుంది
బోర్డరు లో సిపాయిలా
ఉదయం నిదరోతుంది
ఉయ్యాలలొ పాపాయిల

విశ్వాసం మారుపేరు
దీనికెవరు సాటిరారు.

25, నవంబర్ 2011, శుక్రవారం

చదువు- పిల్లలు

పిల్లలపై పెంచకుమా
పుస్తకాల భారం
నువ్వు చదివినపుడుందా
ఇంత చెడ్డఘోరం !

వీధిబడిలో చదివి
నేనింత వాడినైనానని
దీపపు స్తంబం క్రిందె
నాచదువు గడిచిందని

గొప్పలు చెప్పె పెద్దలు
గమనించారా ఇది
చదవ లేక చతికిలపడు
పిల్లవాని పరిస్థితి

ఇష్టం లేని చదువులు
కష్టంగా చదువుతున్న
పష్టుగ రాలేదంటు
నిష్టూరం వేయకండి !

పోటీ తత్వం పెరిగి
ఆందోళనలు కలిగి
జీవితాన్ని సగంలోనే
ముగింఛేటి విద్యార్దుల

భవిష్యత్తు తీర్చిదిద్దు
భాద్యత తలితండ్రులదె
సరియగు గమ్యం చూపె
భాద్యత గురుదేవులదే

పిల్లలలొ పెంచండి
ప్రేమా అభిమానం
అప్పుడే పెరుగుతుంది
అసలగు విజ్జానం !

23, నవంబర్ 2011, బుధవారం

బాల్యం

మోయలేని బరువులు
మన పిల్లల చదువులు
చదవనంటె వెస్తారొయ్
వీపు మీద దరువులు !


ఉదయం నిద్దురలేచి
గబగబ స్తానం చేసి
తిన్నదేంటొ తెలీకనే

ప్రైవేటుకు పరుగులు !

ఎల్.కె.జి తోనె ఆలొచనలు
చిన్ని చిన్ని చదువులకే సులొచనాలు

ప్రతినిముషం తల్లి తండ్రుల హితవచనాలు
బాల్యం అంతా చక్కగ గడిస్తే చాలు  !

క్లాసువర్కు హొంవర్కు
ప్రతిరోజు రిస్క్
కాన్వెంటు చదువులొనె
కంప్యూటర్ కిక్ !


బాల్యం ఓ సుడిగుండం
అవుతోందోయ్ యమగండం
ఎదైనా బడి గండం
కాకుంటె చాలును దండం !

21, నవంబర్ 2011, సోమవారం

కాకిబావ- రైలుబండి.


ఈపాట కూడా అమ్మపాడింది.నా రచన కాదు దీని రచన కూడా ఎవరొ తెలీదు.

రైలు సికినలు చెంత రావిచెట్టుంది
రావిపై నొక కాకిబావ కూర్చుంది
వచ్చిపోయె రైలు వంక చూసింది
రైలు రావడమున్ను బయలు దేరడము.

గమనించి మురిసి రెక్కలు కొట్టుకుంది.
బలగమ్ము నొకనాడు పిలువనంపింది.
రైలు నె రమ్మంటె రావలెనంది
పొమ్మంటె తుర్రున పొవలెనంది.

గమ్మత్తు లెమ్మంది కాకిబలగమ్ము
గమ్మత్తు కాదంటు కాకి బావపుడు
సికినలు చెక్క లెవడం చూసి
రావోయి రావోయి రైలు బావంది

గుప్పుగుప్పున రైలు కూస్తు వచ్చింది
స్టేషను రైలు సేదతేరింది.
గార్దు విజిలేయడం గమనించి కాకి
పంపించి వేస్తున్న చూడండి

పోవోయి పోవోయి పొగరాయుడంది
రైలు గుబ గుబ మంటు బయలు దేరింది.
పొగడ లేక చచ్చె కాకి బలగమ్ము
వినలేక చచ్చెరా మన కాకి బావ.

ఆటలు

చిన్నతనపు ఆటలన్ని
చిత్రమైనవి
తలచుకొంటె మనసు
పులకరింపచెస్తవి!


కోతీకొమ్మచ్చులాట
దాగుడు మూతల ఆట
ఉప్పుపట్టి ఉయ్యాల
ఏడు పెంకులాట !


గాలిలోకి గాలిపటం
ఎగరేసే గమ్మత్తులు
ఉత్తరాలు పంపుతుంటె
తొటివారి కేరింతలు!


ఆడపిల్లలాడు కొనె
తొక్కుడుబిళ్ళట
కాయతొ కాయకొట్టు
గోళీ లాట !


ఎమైనా ఆటలు
మనసుకు హాయినిస్తవి
ఆరోగ్యానికి ఎంతొ
మేలు చేస్తవి!