30, డిసెంబర్ 2011, శుక్రవారం

పాలపీక

పాల పీక...పాలపీక
పాలివ్వని....పాలపీక

సీసానిండుగ వుంటే
పాలు గుమ్మరిస్తుంది.
ఆ సీసా లెకుంటే
తెల్లమొహం వేస్తుంది.

కన్నతల్లిని మరపిస్తుంది.
చిన్నపిల్లలను లాలిస్తుంది.
ఆదమరచి నిదురింపగ బిడ్డకు
అమ్మలాగ తోడౌతుంది.

నోటనుంటె పాలపీక
పిల్ల మోమున చిరునవ్వు
నిదరొతున్నారని తేసావో
ఉయ్యాలలో.. కెవ్వు..కెవ్వు..

ఏమైనా పాలపీక
శిశువుల నేస్తం
ఎంత ఏడుపైనా సరే
ఆపే ....అస్త్రం.

2 కామెంట్‌లు:

  1. తల్లి మురిపాలు
    పాలపీక పాలు
    పాపాయి పాలు
    జో జో టపాలు
    మీ బాల గీతాలు
    కొనసాగాలి నూతన వత్సరం లో మరిన్ని కొత్త టపాల తో

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  2. పిల్లలకు పాలసీసా ఏ కాదు.
    జిలేబి అన్నా ఇష్టమే
    ధన్యవాదాలు జిలేబి గారు.

    రిప్లయితొలగించండి