ఈ పండుగ సమయానా ఒట్టేసి చెబుతున్నా
తెలుగు భాష మనదని తెలుగే మాట్లాడుదునని.
తేనెకంటే తియ్యనైన పలుకులున్న భాష
వెన్నకన్న కమ్మనైన విరుపులున్న భాష
పాయసంలా యతి ప్రాస
వున్న
బాష
ప్రాంతాలని బట్టి యాస వున్న భాష
అల్లరిచే యొద్దన్న నాన్నమందలింపు భాష
అనగనగా.. అంటూ.. అమ్మమ్మ కథ భాష
అత్తా.. మామా.. అనే అప్యాయతలున్న భాష
వేమన పద్యం మనది సుమతీ శతకం మనది
కవిత్రయపు కలం మనది అష్టదిగ్గజ గళం మనది
శ్రీకృష్టదేవరాయ కలమున చిలికిన భాష
బ్రౌన్ దొరమెచ్చుకున్న విలువలున్న భాష
అన్నమయ్య పదాలు త్యాగయ్య స్వరాలు
మిళితమైన భాష మృధుమదురమైన భాష
అక్షరములు ఎక్కువైనా అందమైన భాష
నేర్చుకుంటే సులువుగా మనసున నిలిచేభాష
స్వచ్చ మైన భాష మంచి ముత్యమంటి భాష
సరళ మైన భాష మొగలి సుమం వంటి భాష
దేశభాష లందు తెలుగు లెస్స అనండి
మీవంతు సహకారం అందించండి
ప్రాచీన భాష ఇది ఆదరించండి
బాస చేసి అందరు ఆచరించండి
భాషా సంవత్సరంగా ప్రకటించటమో ఏమో కానీ, చిత్తూరు జిల్లాలో భాషాసభలు జరిగిన సందర్భంగా ఒక సంవత్సరం పాటు వారానికి ఒకసారి ప్రభుత్వోద్యోగులు సంప్రదాయ వస్త్రాలు (ధోవతులు, పంచెలు అన్నమాట) ధరించాలని నిబంధన అని విన్నాను. శాశ్వతంగాను, అన్నిచోట్లా ఈ నిబంధన పెట్టాల గాని ఒక్క సంవత్సరం మాత్రం అదీ ఒక్క జిల్లాలో మాత్రం అంటే అదేదో చనిపోయిన వాళ్ళకి సంవత్సరం పాటు మాసికాలు (నెలకోసారి) తర్వాత సంవత్సరీకాలు జరిపినట్టు ఉన్నది. చిత్తశుద్ధితో చేసినట్టు అనిపించటం లేదు.
రిప్లయితొలగించండి( మన్నించండి మీ టపాకు సంబంధం లేకపోయినా శీర్షికని చూసి స్పందిస్తున్నాను.)
లక్షీదేవి గారు,
రిప్లయితొలగించండిమీ సందనచూసి భాదపడ్డాను. చిత్తూరులో పంచె, ధోవతి కట్టుకుని రావాలని
అన్నారు అంటే అదొక అలవాటుగా చేద్దామని చేసే ప్రయత్నంగా భావించాలి తప్ప,
దానిని తప్పుగా అర్దం చేసుకోకూడదు. తెలుగు భాష కు ఇంత గౌరవం ఇస్తారని
ఊహించామా . జరుగుతున్న పరిణామాలను గమనించండి . మం చిది అన్నచోట ఆనందం
వ్య క్తంచేయండి.మీకు నచ్చక పోతే వదిలేయండి. మంచి జరుగుతుందని ఆశిద్దాం.