ఈ పండుగ సమయానా ఒట్టేసి చెబుతున్నా
తెలుగు భాష మనదని తెలుగే మాట్లాడుదునని.
తేనెకంటే తియ్యనైన పలుకులున్న భాష
వెన్నకన్న కమ్మనైన విరుపులున్న భాష
పాయసంలా యతి ప్రాస
వున్న
బాష
ప్రాంతాలని బట్టి యాస వున్న భాష
అల్లరిచే యొద్దన్న నాన్నమందలింపు భాష
అనగనగా.. అంటూ.. అమ్మమ్మ కథ భాష
అత్తా.. మామా.. అనే అప్యాయతలున్న భాష
వేమన పద్యం మనది సుమతీ శతకం మనది
కవిత్రయపు కలం మనది అష్టదిగ్గజ గళం మనది
శ్రీకృష్టదేవరాయ కలమున చిలికిన భాష
బ్రౌన్ దొరమెచ్చుకున్న విలువలున్న భాష
అన్నమయ్య పదాలు త్యాగయ్య స్వరాలు
మిళితమైన భాష మృధుమదురమైన భాష
అక్షరములు ఎక్కువైనా అందమైన భాష
నేర్చుకుంటే సులువుగా మనసున నిలిచేభాష
స్వచ్చ మైన భాష మంచి ముత్యమంటి భాష
సరళ మైన భాష మొగలి సుమం వంటి భాష
దేశభాష లందు తెలుగు లెస్స అనండి
మీవంతు సహకారం అందించండి
ప్రాచీన భాష ఇది ఆదరించండి
బాస చేసి అందరు ఆచరించండి