22, జూన్ 2012, శుక్రవారం

చిన్నారి చిలుకమ్మ

చిట్టి చిట్టీ చిలుకమ్మ
చిన్నారి చిలుకమ్మ 
పెరటి లో జామచెట్టు 
కాయకాసింది. 
నువ్వొస్తే చిట్టి చెల్లి
కోసిస్తుంది. 
కాయకొరికి రుచి
నువ్వు చెప్పాలమ్మ
చిలక కొరికిన
జామకాయ రుచివేరమ్మ
కొమ్మచివర 
ఉయ్యాల వేస్తానమ్మ
నువ్వు వూగి 
నన్నుఊపి ఆడాలమ్మ
పిల్లలంత నీ కోసం
చూస్తున్నారు
స్నేహానికి చేతులు
చాస్తున్నారు.

6 కామెంట్‌లు:

  1. చిట్టీ చిలకమ్మా...
    తోటకెళ్ళావా?....
    గుర్తొస్తోంది....
    బాగుందీ గీతం..
    @శ్రీ

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. కూచిమంచి వారూ! చక్కని చిలుకను పట్టారండీ...బాగుంది..
      ఆటవెలది:
      చిలుక కొరికినట్టి చెట్టు పండే తీపి
      చిలుక పలికి నట్టి పలుకు తీపి
      చిలుక నడక కులుకు చిత్రమైన లయలు
      చిలుక రూపు మెరుపు చెలగు హొయలు.

      తొలగించండి
    2. శాస్త్రిగారు,
      మంచి పధ్యాలతో అభినందనలు తెలుపుతారు.
      సంతోషం.

      తొలగించండి