ఏ దమ్మా.. పల్లె పిచ్చుక...
ఎక్కడమ్మ దాని కిచ కిచ.....
రేడియేషన్ దాడి చేసింది.
ఇక.. ఊర పిచ్చుక జాడేది.
ఆ పల్లె పిచ్చుక... జాడేది.
ఎక్కడమ్మ దాని కిచ కిచ.....
ముక్కున పీచును పట్టుకొని..
చక్కగ దానిని పేర్చుకుని...
తెల్లని గుడ్లను పెట్టేది.
అద్దంలో తన బింబం చూసి
ముక్కుతొ టక టక కొట్టెది
తుర్రున.. రివ్వున ఎగిరేది
గాలిలో తిరుగాడేది
అంతలోనె తిరుగొచ్చేది
ఆహారమేదో తెచ్చేది.పిల్లల నోటికి అందించి
సందడి సందడి చేసేది.
ఆధునికత నిదర్సనముగా
పెరిగిన సెల్ టవరు
పిచ్చుక బ్రహ్మస్త్రంగా...రేడియేషన్ దాడి చేసింది.
ఇక.. ఊర పిచ్చుక జాడేది.
ఆ పల్లె పిచ్చుక... జాడేది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి